వరుసగా 13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా 13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు
X

ఇంధనం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు వరుసగా 13వ రోజు కూడా పెరిగాయి. లీటరుకు పెట్రోలుపై 53పైసలు, డీజిల్‌పై 64పైసలు ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో ధరల పెంపు రెండు వారల నుంచీ చూస్తే పెట్రోలుపై రూ.6.55, డీజిల్‌పై రూ.7.04 పెరిగింది. కాగా.. ఈ నెల 6న అంతర్జాతీయ విపణిలో 38.32డాలర్లున్న బ్యారల్‌ ముడి చమురు ధర.. బుధవారానికి 40.26కు చేరింది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.37, డీజిల్ రూ.77.06 , ముంబై : పెట్రోలు రూ. 85.21, డీజిల్ రూ.75.53 , చెన్నై: పెట్రోలు ధరూ. 81.82, డీజిల్ రూ.74.77, హైదరాబాద్ : పెట్రోలు రూ. 81.36, డీజిల్ రూ.75.31 , విజయవాడ : పెట్రోలు రూ. 81.76, డీజిల్ రూ.75.73

Tags

Next Story