ఓటుహక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

ఓటుహక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
X

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో చంద్రబాబు ఓటు వేశారు. అంతకుముందు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా టీడీపీ తరుఫున మొదటి ఓటు వేశారు. ఇక ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనాలని టీడీపీ విప్ జారీ చేసింది. కాగా నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఆ పార్టీ పొల్యూట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోటీలో ఉండగా.. వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని ఉన్నారు.

Tags

Next Story