కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా టీడీపీ ఎమ్మెల్యే

రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ విషయంలో TDP నేతల తీరు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు MLAలు ఓటింగ్‌పై ఉత్కంఠ నెలకొంటే, ఇప్పుడు కరోనా కారణంగా ఓటు వేసేందుకు రాలేకపోతున్నానంటూ రేపల్లె MLA అనగాని సత్యప్రసాద్ చెప్తున్నారు. ఇదే విషయంపై ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన వివరిస్తున్నారు. ఇటీవల వ్యాపారరీత్యా జనగాం MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసానని, ఆయనకు కరోనా నిర్థారణ అయినందున తాను కూడా క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి హరిస్తున్న నేపథ్యంలో.. ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు. తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న తాను రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనలేకపోవడం చాలా బాధగా ఉందని అనగాని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి ఏ అవసరం వచ్చినా ముందుండే నేను.. ఇవాళ ఓటింగ్‌కి రాలేకపోతున్నానంటూ రాసుకొచ్చారు. తనను మన్నించాలి అంటూ లేఖ ముగించారు అనగాని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com