స్మార్ట్ ఫోన్ కరోనా వైరస్ ని కనిపెట్టేస్తుందా!!

అవును.. స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనాని గుర్తించే ప్రక్రియను ప్రపంచ పరిశోధనా సంస్థలు చేపట్టాయి. అనుకున్నట్లుగానే చైనానే ఈ విషయంలో ముందుందనే వార్తలు వస్తున్నాయి. కరోనాని నిర్ధారించే కిట్లు ఎన్ని అదుబాటులోకి వచ్చినా స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనాని గుర్తించే అవకాశం ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఫోన్ ద్వారా వైరస్ ని గుర్తించాలంటే లైట్, కలర్, ఎలక్ట్రో కెమికల్ పై ఆధారపడక తప్పదు. ఇప్పటికే పలు వైరస్ లు, బ్యాక్టీరియాలు, టాక్సిన్ స్మార్ట్ ఫోన్ల ద్వారా గుర్తించే పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
హెచ్ ఐవీ, మలేరియా, టీబీలతో పాటు పలు ఆహార పదార్థాల విషతుల్యాన్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా గుర్తించవచ్చు. రోగాలను బట్టి వీటి స్పందన ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి రోగికున్న రోగాన్ని నిర్దారించి సంబంధిత వైద్యులకు సమాచారాన్ని అందిస్తాయి. కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో వస్తుందని అంటున్నారు కానీ వచ్చే లోపు ముందుగా వైరస్ ని గుర్తిస్తే కొన్ని మరణాలను, మరికొన్ని పాజిటివ్ కేసులు పెరగకుండా నివారించవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఏ ప్రాంతాలకు వెళ్లకూడదో ముందుగానే గ్రహించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com