దిల్లీకి భారీ భూకంప ముప్పు..!!

దేశ రాజధాని దిల్లీలో భారీ భూకంప ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ తెలిపింది. గత మే 29 నుంచి ఇప్పటి వరకు దిల్లీలోని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 14 సార్లు భూమి కంపించింది. అయితే ఈసారి దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. భూగర్భ రాతి ఫలకల్లో ఉన్న పీడన శక్తి అత్యధికంగా విడుదల కావడం వల్ల ఈ ప్రాంతంలో తరచు ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
దిల్లీ రాజధాని ప్రాంతంలోని దిల్లీ-హరిద్వార్ కొండ ప్రాంతం, మహేంద్రగఢ్-డెహ్రాడూన్, మొరదాబాద్, సోహ్నా, గ్రేట్ బౌండ్రీ, దిల్లీ-షార్దోఢా, యమున, గంగానది ప్రవాహ ప్రాంతాలు బలహీనమైన జోన్లుగా గుర్తించారు. హిమాలయ అడుగు భాగంలో ఉన్న ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ తో ఢీకొనడం వల్ల పీడన శక్తి కేంద్రీకృతమవుతోంది. ఆ శక్త బలహీనమైన జోన్ల ద్వారా విడుదల కావడం వల్ల అక్కడి రాతి పొరల్లో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలను అనుసరించి భూగర్భలోపాలున్నచోట నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com