నెదర్లాండ్స్‌ నుంచి భీమవరం యువకుడికి డ్రగ్స్ పార్సిల్‌..

నెదర్లాండ్స్‌ నుంచి భీమవరం యువకుడికి డ్రగ్స్ పార్సిల్‌..
X

పశ్చిమగోదావరి జిల్లాలో డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. భీమవరానికి చెందిన యువకుడికి నెదర్లాండ్స్‌ నుంచి పార్శిల్‌ వచ్చింది. అందులో ప్రాణాంతక ఎండీఎంఏ డ్రగ్స్‌ వున్నాయి. ఈ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. చెన్నై కస్టమ్స్‌ అధికారులు భీమవరంలో తనిఖీలు నిర్వహించి భానుచందర్‌ అనే యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో భీమవరం కేంద్రంగా ఈ డ్రగ్స్‌ మాఫియా కోరలు చాచినట్లుగా తెలుస్తోంది. ఈ పార్శిల్‌లో దాదాపు 400 మత్తు మాత్రలు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ మాఫియాలో ఎవరెవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అసలు భీమవరంలో ఈ డ్రగ్స్‌ను ఎవరు వాడుతున్నారు..? ఇక్కడ్నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? వీటన్నిటిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story