తేనెటీగలతో చెలిమి.. ఓ యువకుడి సాహసం

తేనెటీగలతో చెలిమి.. ఓ యువకుడి సాహసం
X

ప్రపంచమంతా కరోనాతో సహజీవనం చేస్తుంటే ఈ 24 ఏళ్ల కేరళ యువకుడు మాత్రం తేనెటీగలతో సహజీవనం చేస్తున్నాడు. తనకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచి తేనెటీగలతో అనుబంధాన్ని పెంచుకున్నాడు సంజయ్ కుమార్. పెరట్లో చెట్టు మీద తెనె తుట్టె పెడితే దాన్ని కదిలించాలంటేనే భయం.. ఎక్కడ తేనెటీగలు వచ్చి కుట్టేస్తాయోనని. అలాంటిది సంజయ్ చిన్నప్పటి నుంచి చేతుల మీద, ముఖ మీద వందలాది తేనెటీగలు వచ్చి వాలినా కిక్కురమనే వాడు కాదు. పైగా ఎంతో ఇష్టంగా అనిపించేదట తనకి అవి వచ్చి అలా వాలడం. ఆ ఇష్టమే తనని రికార్డు నెలకొల్పడానికి కూడా పురిగొల్పింది.

తరువాతి కాలంలో దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు 60 వేల తేనెటీగలను తన మొహంపై ఉంచుకొని గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. తేనెటీగల పెంపకం దారులు కూడా ఇలా చేస్తుంటారు. అయితే సంజయ్ కి కూడా మొదట్లో కొంచెం ఇబ్బందిగానే అనిపించినా రాను రాను అలవాటై పోయిందని అంటున్నాడు. తేనెటీగ ప్రమాదకరం అని తెలుసుకోకముందే వాటితో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అంటాడు. తేనెటీగలపై ఉన్న అభిమానంతోనే బెంగళూరులో ఎపీకల్చర్ సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ చేశాడు. త్వరలో తేనెటీగల మీద పీహెచ్ డీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

Tags

Next Story