ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు ప్లాస్మా థెరపీ

ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు ప్లాస్మా థెరపీ
X

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చికిత్స అందించనున్నారు. ఈమేరకు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని.. ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన మగత, అలసటతో బాధపడుతున్నారని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేపించుకున్న విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకినట్టు వైధ్యులు నిర్ధారణ చేయడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story