అంతర్జాతీయం

జూన్ 21న ఒకేరోజు 7 ప్రత్యేక దినోత్సవాలు

జూన్ 21న ఒకేరోజు 7 ప్రత్యేక దినోత్సవాలు
X

ఆదివారం, జూన్ 21.. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఏకంగా 7 ఉత్సవాలు ఒకే రోజు కలిసొచ్చాయి. వీటిలో ప్రపంచం నాశనమవుతుందని చెప్పే డూమ్స్ డే కూడా ఉంది. ఈ డూమ్స్ డేను కాసేపు పక్కకు పెట్టి ఈ సండే స్పెషాలిటీ ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే..యోగా దినోత్సవం.. 2015లో భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ఏటా జూన్ 21ని ఇంటర్నేష నల్ యోగా డే గా జరుపుకుంటున్నాం. ఏడాదిలో పగటి సమయం అత్యధికంగా ఉండేది జూన్ 21నే. ఆపై పగటి సమయం తగ్గుదల ప్రారంభమవుతుంది.

ఫాదర్స్ డే.. నాన్నల దినోత్సవం.. వాస్తవంగా తండ్రుల దినోత్సవానికి ఫిక్స్‌డ్ డేట్ అంటూ లేదు. ఏటా జూన్ మూడో ఆదివారం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈసారి ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబ భారం మోసే తండ్రిని గౌరవించుకోవడం ఫాదర్స్ డే ఉద్దేశం.

మ్యూజిక్ డే... జూన్ 21ని వరల్డ్ మ్యూజిక్ డేగా పరిగణిస్తారు. ఫ్రెంచ్‌ సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డేని ప్రారంభించారు. 1982 జూన్ 21న పారిస్‌లో తొలిసారి ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహించారు. ఆ తర్వాతి నుంచి మనదేశంతో పాటు 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని చేసుకుంటున్నాయి. సంగీత కళాకారులను సత్క రించుకోవడం, స్మరించుకోవడం మ్యూజిక్ డే ఉద్దేశం.

వరల్డ్ హ్యూమనిస్డ్ డే... ఈ రోజును హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే భావనను పెంపొందించడానికి మానవ హక్కుల సంస్థలు చేతులు కలప డంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. వరల్డ్ హ్యూమనిస్ట్ డే ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. ఐతే, 1980 నుంచి మాత్రం ఏటా వరల్డ్ హ్యూమనిస్డ్ డే జరుపుకుంటున్నారు.

షేక్ హ్యాండ్ డే... ఇది కూడా ఎప్పుడు ప్రారంభమైందో చెప్పే ఆధారాలు లేవు. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరుడు షేక్ హ్యాండ్ డేను ప్రారంభించారని చెబుతారు. సముద్రపు నీళ్లలో చేయి పెట్టి చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి పొందడమే షేక్ హ్యాండ్ డే ఉద్దేశం. ఆ తర్వాత చేయి చేయి కలపడం అలవాటుగా మారిపోయింది. ఐతే, ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా చేతులు కలపడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. సో, ఈ సారి వరల్డ్ హ్యాండ్ షేక్ డే జరుపుకోలేరు.

హైడ్రోగ్రఫీ డే... వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా జూన్ 21నే జరగనుంది. జల వనరుల అభివృద్ధికి, జలవనరుల సంరక్షణకు ప్రజల కట్టుబడి ఉండేలా చేయడమే హైడ్రోగ్రఫీ డే లక్ష్యం. 2005 జూన్ 21 నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఐరాస కూడా వరల్డ్ హైడ్రోగ్రఫీ డేను గుర్తించింది.

టీ షర్ట్ డే.. జర్మనీలోని బెర్లిన్ లో తొలిసారి 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే నిర్వహించారు. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని కనిపెట్టారు. యూత్‌లో కాస్త ఫాలోయింగ్ ఉన్న ఉత్సవాల్లో టీ షర్ట్ డే కూడా ఒకటి.

Next Story

RELATED STORIES