యువకుడిని కొట్టి.. ఆ వీడియోలను అతని చెల్లెలికి పంపి..

యువకుడిని కొట్టి.. ఆ వీడియోలను అతని చెల్లెలికి పంపి..
X

అనంతపురం జిల్లాలో యువకుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది.. ధర్మవరంలోని గాంధీనగర్‌కు చెందిన కార్తీక్‌ అనే యువకుణ్ని దుండగులు అపహరించుకెళ్లారు. ఐదు లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను డిమాండ్‌ చేస్తున్నారు. యువకుణ్నికొట్టిన వీడియోలను అతని చెల్లెలికి పంపి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో ధర్మవరం పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వడ్డీ ప్యారులే కార్తీక్‌ను కిడ్నాప్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఐదు లక్షల రూపాయల అప్పు చెల్లించకపోవడంతోనే అతన్ని చితకబాదినట్లు తెలుస్తోంది. డబ్బు ఇవ్వకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story