తెలంగాణలో ఒక్కరోజే 546 పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో ఒక్కరోజే 546 పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 7072 కు చేరింది. హైదరాబాద్‌లోనే ఒక్కరోజే 458 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు, కరీంనగర్‌ 13, జనగాం 10 కేసులు.. మేడ్చల్‌ 6, మహబూబ్‌నగర్‌ 3, వరంగల్‌ రూరల్‌ 2.. వరంగల్‌ అర్బన్‌ 1, ఖమ్మం 2, ఆదిలాబాద్‌ ఒక కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం 3363 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారి నుండి 3506 మంది కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story