జూన్ 21 స్పెషల్.. ఈ ఒక్కరోజులో ఎన్ని ముఖ్యమైన రోజులు దాగున్నాయో..

జూన్ 21 స్పెషల్.. ఈ ఒక్కరోజులో ఎన్ని ముఖ్యమైన రోజులు దాగున్నాయో..

ఇంద్రధనుస్సు ఏడు రంగులను తనలోనే ఇముడ్చుకున్నట్లు జూన్ 21 ఆదివారం ఒక్కరోజే మరి కొన్ని అందమైన రోజులను తనలో దాచుకుంది. నిజంగా అద్భుతం అనిపించే ఆ స్పెషల్ డేస్ ఏంటో చూద్దామా..

జూన్ 21 అనగానే ముందుగా గుర్తొచ్చేది యోగా డే. అంతగా ప్రాచుర్యం కల్పించారు మన ప్రధాని మోదీ. ఈ రోజు ప్రపంచ మొత్తం భారతీయుల సొంతమైన యోగాని చేస్తున్నారు. ఏడాది మొత్తంలో పగటి సమయం ఎక్కువగా అనిపించేది మూడు రోజులు అంటే 20-21-22.. అయితే వీటిలో మధ్య రోజైన 21ని మోదీ అంతర్జాతీయ యోగాడే గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు యోగా చేయకపోయినా కనీసం ఈ రోజు నుంచైనా యోగా మొదలు పెట్టండి. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా మంచిదని మీకు తెలుసు.. అయినా చేయనంటే ఎలా.

మ్యూజిక్ డే..

అందరూ బాత్ రూమ్ సింగర్సే.. బయటకు రండి. మీకు బాగా నచ్చిన పాట ఒకటి నేర్చుకుని పాడేయండి. 1982లో వరల్డ్ మ్యూజిక్ డేని పారిస్ లో తొలిసారి జరుపుకుంది ఈ రోజే. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ముఖ్య ఉద్దేశం.

సాటి మనిషికి సాయం చేసే రోజు.. అదేనండి వరల్డ్ హ్యూమనిస్ట్ డే.. మానవత్వమే జీవిత పరమార్ధం అనే భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచంలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. ఎవరితో చేతులు కలపకపోయినా మీకు తోచినంత సాయం చేస్తే ఆ తృప్తే వేరు. 1980 నుంచి ప్రారంభమైంది. అది ఈ రోజే కావడం విశేషం.

హ్యాండ్ షేక్ డే.. కరోనా వచ్చాక హ్యాండ్ షేక్ లు కాదు కదా మనిషి ఎదురుగా నిలబడడానికి కూడా భయపడిపోతున్నారు. ఇక ఈ హ్యాండ్ షేక్ డే ముందు ముందు రికార్డుల నుంచి తొలగించబడుతుందేమో. ఇవాన్ జుపా అనే వ్యక్తి సముద్రపు నీళ్లలో చేయి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన అనుభూతిని పొందారట.. అప్పటి నుంచి ఈ డేని ఈరోజు జరుపుకుంటారు.

ఫాదర్స్ డే.. అలసటంతా ఆఫీసులో వదిలేసి నవ్వుతూ ఇంటికి వచ్చే నాన్న కావాలి. నాన్న ప్రేమ కావాలి. నాన్నకి తన ప్రేమ పంచాలి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అని అంటే.. ఈ ఒక్కరోజేనా నాన్నా హ్యాపీ.. రోజూ నీతో ఉంటే నాకు సంతోషమేగా అని నాన్న అంటే ఆ చిన్నారి కళ్లలో విరిసిన ఆనందం అనిర్వచనీయం. జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారమే ఫాదర్స్ డే అని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచం మొత్తం ఈ రోజు ఫాదర్స్ డే ను జరుపుకుంటారు.

హైడ్రోగ్రఫీ డే.. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న వరల్డ్ హైడ్రాలజీ డే నిర్వహిస్తారు.

టీ షర్ట్ డే.. అన్ని డేలు అమెరికా నుంచి ప్రపంచానికి విస్తరిస్తే.. ఈ టీషర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్ లో 2008 లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. ధరించడానికి సులువుగా, స్టయిల్ గా ఉండడంతో ఈ డే యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ రోజు ఈ టీషర్ట్ డేని కొన్ని దేశాల్లో వేడుకలా నిర్వహిస్తారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి.

Tags

Read MoreRead Less
Next Story