మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట
X

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు వీడియోకాన్ఫరెన్స్‌లో విచారణ జరిపింది. వాదనల తర్వాత అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌ను దూషించారంటూ అయ్యన్న పాత్రుడిపై ఇటీవలే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేస్తారని వార్తలొచ్చాయి. వెంటనే అయ్యన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవరినీ దూషించలేదని తనపై కేసు కొట్టివేయాలని, ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని అయ్యన్న చెప్పారు. ఆయన తరపున అడ్వొకేట్ కోర్టులో వాదనలు వినిపించారు. దీంత.. అరెస్టు చెయ్యకుండా మధ్యంతర ఆదేశాలిచ్చిన కోర్టు.. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

Tags

Next Story