కేసుల సంఖ్య తగ్గించాలంటే ఒకటే మార్గం.. : ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తూ మొదటి స్థానంలో నిలిచిన అమెరికా.. టెస్ట్ చేస్తేనే కదా కేసులు సంఖ్య తెలిసేది. అదే చేయకుండా ఉంటే సరిపోతుంది.. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పా అని ట్రంప్ శనివారం ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ట్రంప్ మాటలకు సభలోని మద్దతు దారులు చప్పట్లు చరిచారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచాలన్న అధ్యక్షడు ఇప్పుడు ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆదివారం మధ్యాహ్నానికి అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 22,95,615. వీరిలో 1,21,441 మంది మరణించారు. నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సమాయత్తమవనున్న నేపథ్యంలో కేసులు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com