ఏపీపీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు

X
ఏపీలో ఉద్యోగ నియామాకాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సిద్ధమైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. గ్రూప్1, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్–గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఏపీపీఎస్సీ సవరించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 15 నుంచి ఉద్యోగ నిమామక పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంజనేయులు తెలిపారు. కమిషన్ వెబ్‌సైట్‌లో సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
