శరద్ పవార్ గట్టి షాక్.. పార్టీకి ముఖ్యనేత రాజీనామా

శరద్ పవార్ గట్టి షాక్.. పార్టీకి ముఖ్యనేత రాజీనామా
X

గుజరాత్ లో నేషనల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత శరద్ పవార్ కు లేఖ రాశారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి పార్టీ చీఫ్ గా ఉన్న వాఘేలాను తప్పించి.. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే జయంత్ పటేల్ ను పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అంతా జరిగిన తరువాత రాజ్యసభ ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు గాను.. మూడు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఈ అన్ని విషయాలు వాఘేలా.. శరద్ పవార్ కు రాసిన లేఖలో ప్రస్థావించారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శ పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Tags

Next Story