అంతర్జాతీయం

భారత్‌-చైనాల మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నరష్యా

భారత్‌-చైనాల మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నరష్యా
X

సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో రోజురోజుకు దిగజారుతున్న భారత్- చైనా సంబంధాలను మెరుగుపరిచేందుకు రష్యా కృషి చేస్తోందా... మధ్యవర్తిత్వాన్ని నిర్వహించి యుద్ధాన్ని నివారించేందుకు రష్యా ప్రయత్నిస్తోందా.. పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భారత్‌ - చైనా బార్డర్‌లో టెన్షన్‌ వాతావరణ నెలకొన్న పరిస్థితుల్లో... రెండు దేశాల రక్షణ మంత్రులు ఒకే వేదికపై ఎదురుపడనున్నారు. రష్యా రాజధాని రెడ్ స్క్వేర్‌లో జరిగే రష్యా విక్టరీ పరేడ్‌ దీనికి వేదిక కానుంది. ఈ సందర్భంగా రెండు దేశాల రక్షణ మంత్రులు మాట్లాడుకునే అవకాశం ఉంది. దీంతో వారి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో లోయలో తీవ్ర ఘర్షణ తర్వాత... రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా దిగజారాయి. ఏక్షణమైనా యుద్ధం జరగవచ్చన్నంత ఉద్రిక్తంగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి కండిషన్స్‌లో... భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి ఈ ఫెంగీ ఎదురుపడే సందర్భం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి మధ్య అధికారిక సమావేశానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన లేకపోయినప్పటికీ... భేటీ అయ్యేలా చేసేందుకు రష్యా ఏర్పాట్లు చేసినట్ట సమాచారం.

రక్షణ మంత్రులు ఒకే వేదికను పంచుకోవడానికి ముందు రోజు.. భారత్‌ - చైనా విదేశాంగ మంత్రులు జయశంకర్‌, వాంగ్‌ యీలలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఇందులో రష్యా విదేశాంగ మంత్రి కూడా పాల్గొననున్నారు. ఈ భేటీని రష్యా ఏర్పాటు చేసింది. మరోవైపు భారత్‌- చైనాల మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ... రెండు దేశాలు తిరస్కరించాయి. దీంతో తమ మిత్ర దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.

Next Story

RELATED STORIES