నిరాడంబరంగా పూరీ జగన్నాథ రథయాత్ర

నిరాడంబరంగా పూరీ జగన్నాథ రథయాత్ర
X

పూరిలో జగన్నాథ యాత్ర నిడారంబరంగా జరుగుతోంది. సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో.. జగన్నాథ యాత్ర మంగళవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రస్తుతం జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేవలం 500 మందితో యాత్ర నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి నిబంధనల అమలులో రాజీ లేకుండా, ఒడిస్సా, కేంద్రం సమన్వయంతో రథయాత్ర నిర్వహించాలని సుప్రీం ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నారు. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపిన తరువాత యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది.

Tags

Next Story