వైసీపీ ఎంపీ రాసిన లేఖపై లోక్‌సభ స్పీకర్ చర్యలు

తనకు ప్రాణహాని ఉందంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు రాసిన లేఖపై లోక్‌సభ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. రఘురామ కృష్ణమరాజు ఫిర్యాదును హోంశాఖకు పంపారు స్పీకర్ ఓంబిర్లా. పూర్తి వివరాలు సేకరించి రఘురామ కృష్ణమరాజుకు తక్షణం భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించారు.
స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందిన వెంటనే చర్యలు ప్రారంభించింది కేంద్ర హోంశాఖ. ఎంపీకి వస్తున్న బెదిరింపులపై ఆరా తీసింది. నిఘా వర్గాల నుంచి సమాచార సేకరిస్తున్నారు హోంశాఖ అధికారులు. రఘురామ కృష్ణమరాజుకు కేంద్ర బలగాల భద్రత కల్పించే అంశం పరిశీలిస్తోంది హోంశాఖ.
తన సొంత నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని.. మరికొందరు కాళ్లు, చేతులు తీసేస్తామని బెదిరిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉండడంతోనే రక్షణ కల్పించాలి అంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను అన్నారు. కరోనా విషయంలో ఒక అధికారిణిపై ప్రతిపక్ష పార్టీకి చెందిన అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. నిర్భయ కేసు పెట్టిన రాష్ట్ర పోలీసులు.. తనకు ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com