అంబులెన్స్‌లు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ విజయసాయిరెడ్డి అల్లుడిదా కాదా? : చంద్రబాబు

కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ సీనియర్ నేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ఇంటింటికి 3 మాస్కులు ఇస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందన్నారు. మాస్కుల తయారీలోనూ స్కాంలు జరిగాయని, కరోనా కిట్ల కొనుగోళ్లలో, బ్లీచింగ్ కొనుగోళ్లలో కుంభకోణాలు జరిగాయన్నారు. చివరికి అంబులెన్స్‌లలోనూ రూ. 307 కోట్లు స్కాం చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు.
అంబులెన్స్‌ల కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ కాదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. దానికి అంబులెన్స్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అడిగితే వేధిస్తారా అని ప్రశ్నించారు. సరస్వతీ పవర్ మీ సొంత కంపెనీ అవునా కాదా? అడిగారు. నీళ్లు, గనులు ఎలా కేటాయిస్తారని అడిగితే సెక్రటరీతో నోటీసులిస్తారా? ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలేసి...అవినీతి బయటపెట్టిన వాళ్లకు నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు చంద్రబాబు. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు చంద్రబాబు. వైసీపీ అకృత్యాలకు ఇంతకన్నా రుజువు ఏం కావాలన్నారు. అధికార పార్టీ ఎంపీ ప్రాణాలకే రాష్ట్రంలో భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు హానీ ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గతంలోనే లేఖ రాశారని గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే... వైసీపీ ఎంత భయోత్పాతం సృష్టిస్తోందో అర్థం అవుతుంది
నందిగామలో కృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేశారని, విశాఖలో 70 ఏళ్ల కిషోర్‌ను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. గుంటూరులో 66 ఏళ్ల రంగనాయకమ్మపైనా తప్పుడు కేసు పెట్టి వేధించారన్నారు. చివరికి వృద్ధులను కూడా వైసీపీ నేతలు వదలడం లేదంటూ మండిపడ్డారు చంద్రబాబు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని ముగ్గురు దళితుల్ని అరెస్ట్ చేశారన్నారాయన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com