కరోనా విషయంలో అధికారిణిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే నిర్భయ కేసు : వైసీపీ ఎంపీ

కరోనా విషయంలో అధికారిణిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే నిర్భయ కేసు : వైసీపీ ఎంపీ
X

తన సొంత నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని.. మరికొందరు కాళ్లు, చేతులు తీసేస్తామని బెదిరిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఆరోపించారు.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉండడంతోనే రక్షణ కల్పించాలి అంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను అన్నారు.. కరోనా విషయంలో ఒక అధికారిణిపై ప్రతిపక్ష పార్టీకి చెందిన అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. నిర్భయ కేసు పెట్టిన రాష్ట్ర పోలీసులు.. తనకు ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Tags

Next Story