ప్రకాశం జిల్లాలో నేతన్నల పరిస్థితి నానాటికీ దుర్భరం

ప్రకాశం జిల్లాలో నేతన్నల పరిస్థితి నానాటికీ దుర్భరం

ప్రకాశం జిల్లాలో నేతన్నల పరిస్థితి నానాటికీ దుర్భరమవుతోంది... పూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. చేనేతకు ఆయువుపట్టులాంటి చీరాల ప్రాంతంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమే అతిపెద్దరంగంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు 30వేలకుపైగా మగ్గాలుంటే ఇప్పుడవి కేవలం 4 వేలకు పడిపోయాయి. ఈపురుపాలెం, వేటపాలెంతో ఇదే వృత్తిని నమ్ముకొని దాదాపు లక్ష మంది వరకు జీవనం సాగిస్తున్నారు.. హ్యాండ్లూమ్ అధికారుల లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 7 వేల 184 మగ్గాలు ఉన్నట్లు గుర్తించి... నేతన్న నేస్తం అర్హుల జాబితాను రూపొందించారు.. ఈ ఏడాది మళ్లీ సర్వే నిర్వహించి.. నిబంధనల పేరుతో పలువురి పేర్లను తొలగించారు.. ప్రస్తుతం 6 వేల 915 మందిని అర్హులుగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story