ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. అధికారుల నిర్లక్ష్యం

X
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు ఒక్కచోట చేరకుండా చూడాలి. కానీ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం లాటరీ పద్ధతి ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో జనాలు భారీగా వచ్చారు. కంటైన్మెంట్ జోన్ అని కూడా లెక్కచేయలేదు. భౌతిక దూరం కూడా పాటించకుండా క్యూల్లో కిక్కిరిసిపోయి నిల్చున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూశారు.. క్యూల్లో నిల్చున్న వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వ్యాపిస్తుంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
