భారత్‌: ఒక్కరోజే 15968 పాజిటివ్‌ కేసులు

భారత్‌: ఒక్కరోజే 15968 పాజిటివ్‌ కేసులు
X

దేశంలో కరోనా మహమ్మారి దాడి ఆగడం లేదు. రోజురోజుకు వెప్తి ఉధృతమవుతోంది. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ‌గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 15968 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. ఈ మహమ్మారి కారణంగా 465 మంది మరణించారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసులు ఇప్పటివరకు 4,56,183 కు చేరుకున్నాయి. అలాగే మొత్తం 14,476 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం దేశంలో 1,83,022 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story