మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు.. ఏడాది పాటు

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు..  ఏడాది పాటు

మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పివీ శతజయంతి వేడుకలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పీవీ పుట్టిన రోజైన జూన్‌ 28నుంచి ఈ ఉత్సవాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానిగా, ఆర్ధిక సంస్కర్తగా దేశానికి ఆయన చేసిన సేవలను ఘనంగా స్మరించుకోవాలని సూచించారు కేసీఆర్. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కోసం..సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కే. కేశవరావు ఆధ్యర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవీ, మంత్రులు ఈటెల, కేటీఆర్ మరికొంత మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

Tags

Next Story