23 Jun 2020 7:48 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / 600 మిలియన్ డాలర్ల...

600 మిలియన్ డాలర్ల వారసత్వ సంపద.. అయినా ఆత్మహత్య!!

600 మిలియన్ డాలర్ల వారసత్వ సంపద.. అయినా ఆత్మహత్య!!
X

మానసిక ఆందోళన మరణానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకునే వారు ఏమీ గుర్తురావేమో.. డబ్బు, భార్యా పిల్లలు, టార్గెట్లు, మంచీ చెడూ ఏదీ ఆలోచించరు. ఆ క్షణంలో అంతిమ నిర్ణయం డిసైడ్ అయిపోతుందేమో. మానసిక సంఘర్షణను భరించలేక బలవంతంగా ప్రాణాలుతీసుకుంటున్నారు. మొన్నటి మొన్న ఎంతో భవిష్యత్ ఉన్న బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుంటే.. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్టీవ్ బింగ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్ సెంచరీ సిటీలో నివసిస్తున్న స్టీవ్ తన అపార్ట్ మెంట్ లోని 27వ అంతస్తు నుంచి దూకి మరణించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

కాగా గత కొంత కాలంగా బింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. బింగ్ నిర్మాతతో పాటు రియల్ ఎస్టేట్ డెవలపర్. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన యాక్షన్ చిత్రం గెట్ కార్డర్, మ్యూజిక్ డాక్యుమెంటరీ షైన్ ఎ లైట్, కామెడీ సినిమా కంగారు వంటి చిత్రాలు నిర్మించారు. 2004లో 80 మిలియన్ డాలర్లతో నిర్మించిన ది పోలార్ ఎక్స్ ప్రెస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై 300 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు స్టీవ్ బింగ్ చిరకాల మిత్రుడు. తన 18 ఏళ్ల వయసులోనే 600 మిలియన్ డాలర్లను వారసత్వ సంపదగా పొందారు. బింగ్ కు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story