ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్

X
కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కేవలం మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు వారం రోజుల పాటు బయట తిరిగ రాదని.. రేపు, ఎల్లుండి నిత్యావసరాలు కొలుగోలు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ని పాటించాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
