తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు యూనివర్సిటీ ఇదే : మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు యూనివర్సిటీ ఇదే : మంత్రి మల్లారెడ్డి

సామాన్యులకు ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను చేరువ చేసే ఉద్దేశంతో మల్లారెడ్డి యూనివర్సిటీని స్థాపించానని మంత్రి మల్లారెడ్డి అన్నారు .హైదరాబాద్ మైసమ్మగూడలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ లోగో,బ్రోచర్‌ ,వెబ్‌సైట్‌ను మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజింత్ రెడ్డిలు ఆవిష్కరించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, డిగ్రీలలో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు .

ప్రస్తుత పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యా విద్యార్థులుకు అందిస్తూ... కోర్సు పూర్తయ్యేలోగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్వేయంగా ముందుకువెళ్తున్నామన్నారు . తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ అని...ఈ వర్సిటీలో ప్రపంచ స్థాయి కోర్సులను అందించడం అభినందనీయమని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story