కరోనా ఆయనకి అదృష్టాన్ని తెచ్చింది.. సంపద 25శాతం పెరిగింది..

కరోనా ఆయనకి అదృష్టాన్ని తెచ్చింది.. సంపద 25శాతం పెరిగింది..
X

వ్యాక్సిన్ కింగ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి పూనమ్ వాలా కరోనా సంక్షోభ సమయంలోనూ ఆదాయాన్ని పెంచుకున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఆయన ఆస్తుల నికర విలువ 25 శాతం పెరిగింది. దాంతో ప్రపంచ కుబేరుల జాబితాలో పూనమ్ 86వ స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినా సంపద విలువ అత్యంత వేగంగా పెరిగిన వారిలో పూనమ్ అయిదో స్థానంలో నిలుస్తారని హురున్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. పూణె ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సీరమ్ ఇనిస్టిట్యూట్ స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు. అయితే వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్ధ కావడం సీరమ్ కి కలిసి వచ్చింది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల తయారీ కోసం ఆస్టాజెనెకాతో సీరమ్ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags

Next Story