పెట్రోల్ కంటే డీజిల్ ధరలు అధికం..

పెట్రోల్ కంటే డీజిల్ ధరలు అధికం..
X

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం, ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.92 చేరుకోగా.. డీజిల్

ధర లీటరుకు 80.02 రూపాయలు చేరుకుంది. ఈ పెరుగుదలతో భారత్‌లో తొలిసారిగా డీజిల్‌ ధరలు పెట్రోల్‌ ధర కంటే పెరిగినట్టయింది. అయితే డీజిల్ ధర అధికంగా ఉండడం వల్ల దానికి.. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్‌ను బాగా పెంచడం జరిగిందని.. అందువల్ల డీజిల్‌ ధరలు దేశరాజధానిలో పెట్రోల్‌ను మించిపోయాయని ప్రభుత్వరంగ ఐఓసీ చీఫ్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌కు 82.79 రూపాయలకు చేరింది.

Tags

Next Story