గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ మృతి

గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ మృతి
X

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండె పోటుతో అకాల మరణం చెందారు. ఆయన హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. దాంతో హుటాహుటిన రాజశేఖర్‌ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ మరణించారని తెలుసుకున్న సహ ఉద్యోగులు కొందరు ఆసుపత్రికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు.

Tags

Next Story