అంతర్జాతీయం

అధ్యక్షుడైనా మాస్క్ ధరించకపోతే రూ.30వేలు ఫైన్: కోర్టు

అధ్యక్షుడైనా మాస్క్ ధరించకపోతే రూ.30వేలు ఫైన్: కోర్టు
X

అసలే కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువై ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో వ్యాప్తి నిరోధానికి కనీస జాగ్రత్తలైనా పాటించకపోతే ఎలా అని బ్రెజిల్ అధ్యక్షుడిపై విరుచుకు పడింది స్థానిక కోర్టు. అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో మాస్కు ధరించకుండా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో దేశ ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నారంటూ న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ నేరం కింద అధ్యక్షుడికి రోజుకు రూ.30వేల రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు.

బహిరంగ కార్యక్రమాల్లో మాస్కు ఖచ్చితంగా ధరించాలని అధ్యక్షుడిని ఆదేశించింది. కాగా, అమెరికా తరువాత అత్యధిక కేసులు నమోదైంది బ్రెజిల్ లోనే.. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు లక్షా 15 వేలు కాగా, 613 మంది చికిత్స తీసుకుని కోలుకున్నారు. 52,771 మంది కరోనా బారిన పడి మరణించారు.. మిగిలిన వారు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES