కరోనా నుంచి బయటపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది..

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజువారీ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. డైలీ కేసుల సంఖ్య 15 వేలు దాటి 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో 15 వేల 968 కొత్త కేసులు నమో దయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 465 మంది కరోనాతో చనిపోయారు. మొత్తంగా దేశంలో 4 లక్షల 66 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో లక్ష 87 వేల యాక్టివ్ కేసులు ఉండగా, 2 లక్షల 65 వేల మంది డిశ్చా ర్జ్ అయ్యారు. దేశం మొత్తమ్మీద 14 వేల 625 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌లో కరోనా నుంచి బయటపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్‌డ్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్‌డ్ కేసులు 75 వేలు ఎక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు 57 శాతానికి పెరిగిందని I.C.M.R తెలిపింది. అలాగే, కరోనా పరీక్షల సంఖ్య కూడా పెరిగింది. గత 24 గంటల్లో 2 లక్షల 15 వేల 195 మంది శాంపిల్స్ పరీక్షించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 75 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ వెయ్యికి పెరిగాయి. ఇందులో 730 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయి. 270 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. జనవరి 23 నాటికి దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేది. మార్చ్ 23 నాటికి ల్యాబ్‌ల సంఖ్య 160కి చేరింది. ఇప్పుడా సంఖ్య వెయ్యికి పెరిగింది. వ్యాధి నిర్దారణకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, సీరో సర్వే కోసం యాంటీ బాడీ టెస్టు విధానాలు అనుసరించాలని I.C.M.R ఆదేశించింది.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. ఆయా రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ముంబైపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండ గా, ఇప్పుడు ఆ స్థానంలోకి ఢిల్లీ వచ్చిచేరింది. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ప్రతి రోజూ మూడున్నర వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే అత్యంత వేగంగా రెట్టింపు అవుతున్నాయి. 12 రోజుల్లోనే ఇక్కడ కేసుల సంఖ్య రెట్టింపైంది. ఇప్పటివరకు దేశంలో ధృవీకరించిన మొత్తం కేసులలో 13 శాతం ఢిల్లీలో మాత్రమే నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం మరణాలలో 15 శాతానికి పైగా ఢిల్లీ నుంచే ఉన్నాయి.
తమిళనాడు, కర్ణాటకల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరులో పరిస్థితి సీరియస్‌గా ఉం ది. ఈ రెండు నగరాల్లో కరోనా బాధితులు వేగంగా పెరుగుతున్నారు. దాంతో చెన్నైలో ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చే స్తున్నారు. బెంగళూరులోనూ లాక్‌డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com