ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక మెట్రో స్టేషన్..

దేశంలో ఫస్ట్ టైమ్ ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు. నోయిడాలోని సెక్టార్ 50 స్టేషన్‌ను వారి కోసం కేటాయించారు. ఈ స్టేషన్ కు ‘రెయిన్ బో’ అని పేరు నిర్ణయించినట్లు నోయిడా మెట్రో రైలు కార్పొరేషన్ తెలిపింది. ట్రాన్స్ జెండర్ల సమాజం, ఎన్జీవోల నుంచి వచ్చిన సలహాల ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశామని ఎండీ రీతూ మహేశ్వరి తెలిపారు. ఆక్వాలైన్ లోని ఈ లైన్ నోయిడా స్టేషన్ నుంచి గ్రేటర్ నోయిడా స్టేషన్ వరకు వెళ్తుంది. ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణం చేసే వారికి, ఉద్యోగం చేసే వారికి అనుకూలమైన వాతావరణ అక్కడ ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే తమ సంస్థలో చాలా మంది ట్రాన్స్ జెండర్‌లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అందుకే వారికి ప్రత్యేకంగా స్టేషన్ ఏర్పాటు చేశామని రీతూ మహేశ్వరి తెలిపారు. ట్రాన్స్ జెండర్ల సాధికారతకు ఈ 'రెయిన్ బో' మెట్రో స్టేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలోనే ట్రాన్స్ జెండర్ స్టాఫ్ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వారే పని చేస్తారని చెప్పారు. అంతేకాదు ఈ స్టేషన్ లో దిగి, ఎక్కే ట్రాన్స్ జెండర్ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అంతకు ముందు ఈ ‘సెక్టార్ 50’ స్టేషన్ పేరును ‘షీ మ్యాన్’గా మర్చారు. అభ్యంతరాలు రావడంతో చివరకు 'రెయిన్ బో' మార్చామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com