పీవీపీ తప్పు తేలితే అరెస్ట్ చేస్తాం : పోలీసులు

పీవీపీ తప్పు తేలితే అరెస్ట్ చేస్తాం : పోలీసులు

బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లోని భూమి విషయమై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. పీవీపీ అనుచరులు తనపై దాడి చేశారని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారణ జరిపారు. ఏం జరిగిందన్నది అడిగి తెలుసుకున్నారు. కైలాశ్ విక్రమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. ఇంకా దర్యాప్తు జరుగుతోందని.. పీవీపీ తప్పు ఉన్నట్లు తేలితే ఆయన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఏడాది క్రితం పీవీపీ విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్ విక్రమ్. కొనుగోలు సమయంలో ఎలాంటి రూల్స్ చెప్పలేదన్నది ఆయన వాదన. ఇప్పుడు టెర్రస్‌పై రూఫ్‌ టాప్ గార్డెన్‌ నిర్మిస్తుంటే పీవీపీ వచ్చి వద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు.గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని స్పష్టం చేయడంతో..బుధవారం పీవీపీ 40 మందితో వచ్చి దౌర్జన్యం చేశారని కైలాష్ ఆరోపించారు.. గార్డెన్‌ పనుల్ని అడ్డుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు..

కైలాష్ విక్రమ్ ఇంటి వెనుకాలే పీవీపీ ఇల్లు ఉంది. టెర్రస్‌పై గార్డెన్ నిర్మిస్తే... తన ఇల్లు సరిగా కనిపించదన్నది పీవీపీ వాదన. అయితే ఇల్లు కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి నిబంధనలు చెప్పకుండా... ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని కైలాష్ విక్రమ్ ప్రశ్నిస్తున్నారు...ఫ్లాట్ విక్రయించిన తర్వాత డెవలపర్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి.. తమ ఇంట్లో చేసుకుంటున్న మార్పులను పీవీపీ ఎలా అడ్డుకుంటారని నిలదీస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాలతో మాట్లాడారు పోలీసులు.. విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags

Next Story