టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ విద్యార్థులకు పరీక్షలు లేవు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్, 10వ తరగతి సీబీఎస్‌ఈ విద్యార్థుకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వాహణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. జూలై 1 నుంచి 15 వరకూ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అయితే, కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం ఏమాత్రం క్షేమం కాదని.. విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. మొత్తం 15వేల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తే.. పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఉందని.. అందుకే పరీక్షలు రద్దు చేయాలని తల్లిదండ్రులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పరీక్షల విషయంలో మీ నిర్ణయమేంటని సుప్రీంకోర్టు బోర్టును ప్రశ్నించింది. దీంతో బోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com