కార్మికులకు పాజిటివ్.. మారిన దర్శన వేళలు..

కార్మికులకు పాజిటివ్.. మారిన దర్శన వేళలు..
X

తూర్పు గోదావరి జిల్లా శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో షెడ్ నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వీరిని ఆలయ అధికారులు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్నారు. తండ్రీ (50), కొడుకు (24) లిద్దరూ జూన్ 22న పరీక్ష చేయించుకుంటే కొవిడ్ అని తేలిందని దేవస్థానం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కోటగిరి కొండలరావు తెలిపారు. ప్రధాన ఆలయం వెలుపల షెడ్ నిర్మిస్తున్న 16 మంది సభ్యుల్లో వీరిద్దరూ భాగమని అధికారి తెలిపారు. వారికి పాజిటివ్ రావడంతో మిగిలిన వర్కర్లందరినీ హోం క్వారంటైన్ కి పంపారు. దీంతో జిల్లా అధికారులు దేవస్థానం ప్రాంగణాన్ని 'బఫర్ జోన్' గా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఆదేశాలు వచ్చేవరకు ఉదయం 6నుంచి 10 గంటల మధ్య ఆలయ కార్యాకలాపాలకు అనుమతి ఉంటుంది.

Tags

Next Story