'ఆమె' కోసం బస్సుని 'టాయిలెట్' గా మార్చిన కలెక్టర్..

ఆమె కోసం బస్సుని టాయిలెట్ గా మార్చిన కలెక్టర్..
X

మనసు పెడితే పనికి రావని పడేసిన వస్తువులను కూడా మళ్లీ ఉపయోగపడేలా చేయొచ్చని నిరూపించారు కలెక్టర్ హరిచందన.. ఆమె చేసిన మంచి పనిని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ ఏర్పాటులో కలెక్టర్ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యంతో పాటు భద్రతనూ అందిస్తుంది అని మంత్రి పేర్కొన్నారు.

నారాయణపేట్ జిల్లా కలెక్టర్ హరి చందన తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వినియోగంలో లేని ఆర్టీసీ బస్సును మొబైల్ టాయిలెట్ ఏర్పాటుకు చొరవ చూపించారు. నారాయణపేట జిల్లా కోస్థి పురపాలికలో వీటిని ఏర్పాటు చేశారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు హరిచందన తెలిపారు.

Tags

Next Story