పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్సా? : ఎంపీ రఘురామ కృష్ణంరాజు

పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్సా? : ఎంపీ రఘురామ కృష్ణంరాజు
X

వైసీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కి సమాధానం పంపారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆయన తక్షణం దీనిపై స్పందించారు. వారం రోజులు గడువు ఇచ్చినా నోటీసు అందిన మర్నాడే సంజాయిషీ పంపించారు. వైసీపీ షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటైన సమాధానం ఇచ్చారు..

పార్టీ పేరుపైనే అభ్యంతరం చెప్తూ నోటీస్‌కు సమాధానం ఇచ్చారు రఘురామకృష్ణంరాజు.. పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా? అని ప్రశ్నించారు.. జాతీయ ప్రధానకార్యదర్శిగా పేర్కొంటూ విజయసాయిరెడ్డి నోటీసు ఇవ్వడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉన్న దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డికి సూటిగా ప్రశ్నించారు.

Tags

Next Story