పంజా విసురుతోన్న కరోనా.. భారత్‌లో కొత్తగా 17,296‌ కేసులు

పంజా విసురుతోన్న కరోనా.. భారత్‌లో కొత్తగా 17,296‌ కేసులు
X

దేశంలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17 వేల 296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కోవిడ్‌ పేషంట్లలో రికవరీ రేటు 57.43 శాతంగా ఉందని కేంద్రం తెలిపిది. ఇకకరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 15,301కి చేరింది.

తాజా కేసులతో... దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 లక్షల 90 వేల 401 కి చేరింది. కరోనా బారినపడ్డవారిలో... 2 లక్షల 85 వేల 637 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం ఒక లక్షా 89 వేల 463 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో... నిర్ధారణ పరీక్ష సంఖ్యను పెంచుతున్నారు. గురువారం ఒక్క రోజులో... 2 లక్షలకుపైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్టు... ICMR తెలిపింది. గురువారం ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా కోవిడ్ శాంపిల్స్‌ పరీక్షించారు. మనదేశంలో కరోనా బారినపడిన వారిలో కేవలం 4.16 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరమవుతోందని అధికారులు తెలిపారు.

ప్రతి లక్ష మందిలో 33.39 మంది కరోనా బారిన పడుతున్నారని... ICMR తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష మందిలో 120 మంది కరోనా వైరస్‌కు గురవుతున్నారు. దేశంలో ప్రతి లక్ష మందిలో ఒకరు మరణిస్తుండగా... ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు... 6.24గా ఉంది.

Tags

Next Story