అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం.. గౌహతిలో రెండువారాల లాక్‌డౌన్

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం.. గౌహతిలో రెండువారాల లాక్‌డౌన్
X

అసోం ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 15 నుంచి గౌహతిలో కేసులు విపరీతంగా పెరిగాయని.. దీంతో ఈ మహమ్మారి కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వాస శర్మ తెలిపారు. కొత్తగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలవుతాయని అన్నారు. అయితే, మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతోందని అన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాలలో అసోంలో ఎక్కవ కరోనా కేసులు నమోదయ్యాయి. 6300 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకూ 4033 మంది కోలుకున్నారు. అటు, 9 మంది కరోనాతో మరణించగా.. 2279 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story