ఏపీలో కొత్తగా మరో 570 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా మరో 570 కరోనా కేసులు
X

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22 వేల 305 సాంపిల్స్ ను పరీక్షించగా 570 పాజిటివ్ కేసులువచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11498 కు చేరింది. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే కొత్తగా కర్నూల్ లో నలుగురు, కృష్ణలో నలుగురు, గుంటూరులో ఒకరు , విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దాంతో మరణాల సంఖ్య 146 కు చేరింది. కొత్తగా 191 మంది కోలుకున్నారు.

Tags

Next Story