రానున్న రోజుల్లో బంగారం రేటు భారీగా.. 10 గ్రాములు..

రానున్న రోజుల్లో బంగారం రేటు భారీగా.. 10 గ్రాములు..
X

బంగారం మీద పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్లు. దాంతో పుత్తడి రేటు రూ. 50వేల మైలు రాయిని దాటి సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్నఆందోళన నేపథ్యంలో పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 1-2 నెలల్లో 10 గ్రాముల బంగారం రూ.51,000కు చేరుకుంటుందని ఏంజెల్ బ్రోకింగ్ కమోడిటీస్, కరెన్సీ రీసెర్చ్ విభాగ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అన్నారు. వచ్చే 18-24 నెలల్లో దేశీయంగా బంగారం ధర రూ.65,000-68,000 కు చేరుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

అయితే ఇది డాలర్ రూపాయి మారకం రేటు కదలికలపైన ఆధారపడి ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ షైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ కరోన్సీ విభాగ అధిపతి కిశోర్ నార్నే అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక బంగారం పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రిటర్నులు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ.49,072, కాగా వెండి కిలో రూ.48,705గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు (31.10 గ్రాములు) 1,767 డాలర్లు కాగా, సిల్వర్ రేటు 17.58 డాలర్లు నమోదవుతోంది. ఇర హైదరాబాద్ లో మాత్రం బంగారం రూ.50 వేల పైన కొనసాగుతోంది. అయితే 24 క్యారెట్ల ధర రూ.50,370కి,22 క్యారెట్ల ధర రూ.46,160కి దిగివచ్చింది.

Tags

Next Story