25 Jun 2020 9:20 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఒసామా బిన్ లాడెన్...

ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు: ఇమ్రాన్ ఖాన్

ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు: ఇమ్రాన్ ఖాన్
X

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ అమర వీరుడంటూ వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు పాక్ లోని అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్ ను చంపినపుడు మేము చాలా ఇబ్బందులు పడ్డామని ఆయన అన్నారు. 9/11 దాడులకు సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌ గురించి ఇలా మాట్లాడటం ఇమ్రాన్ కు కొత్తేం కాదు. గతంలో కూడా ఓ ఇంటర్వూలో.. బిన్ లాడెన్ బ్రిటష్ కు మాత్రమే ఉగ్రవాది అని.. మిగతావారికి స్వతంత్రసమర యోదుడని అన్నారు. లాడెన్ ను ఉగ్రవాది అంటే నేను ఒప్పకోనని తేల్చిచెప్పారు. అయితే, గతేడాది.. అమెరికాలో పర్యటించిన ఇమ్రాన్.. లాడెన్ తల దాచుకున్న ప్రదేశం వివరాలు అమెరికాకు తానే ఇచ్చానని.. అయితే, లాడెన్ ను చంపేందుకు ఆపరేషన్ చేయకూడదని చెప్పినట్టు కూడా చెప్పారు.

Next Story