ఇక నుంచి ఇవి రైల్వే ఫ్లాట్ ఫామ్ పై..

ఇక నుంచి ఇవి రైల్వే ఫ్లాట్ ఫామ్ పై..
X

మాస్క్, శానిటైజర్ మన జీవితాల్లో భాగం చేసుకోవాలి అని పదే పదే డాక్టర్లు చెబుతున్నారు. అయినా అశ్రద్ధ లేదా మర్చిపోవడం ఇలా ఏదో ఒకటి జరుగుతుంటుంది. మరి రైలు ప్రయాణాలు చేసేటప్పడు హడావిడిగా వస్తే కంగారు పడవలసిన పన్లేదు. ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న అన్ని స్టాల్స్ లో కరోనా వ్యాప్తి నివారణ వస్తువులను అమ్మాలని రైల్వే శాఖ ఆదేశించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఎమ్మార్పీ ధరకు మాత్రమే అమ్మాలని ఒక్క పైసా ఎక్కువ తీసుకున్నా చర్యలు తీసుకోబడతాయని దుకాణదారులను హెచ్చరించింది. వీటితో పాటు బెడ్ రోల్ కిట్ కూడా దొరుకుతుంది. ఇందులో దిండు, దిండు కవర్, దుప్పటి, ఫేస్ టవల్ ఉంటాయి. ఇవి నాణ్యమైనవి అమ్మాలని సూచించింది. ఇంతకు ముందు ఏసీ బోగీల్లో వారికి రైల్వే శాఖ సరఫరా చేసేది. ఇప్పుడు కరోనా కారణంగా ఆ సౌకర్యాన్ని ఎత్తివేసింది. దాంతో ఎవరి దుప్పటి, దిండు వారే తెచ్చుకోవాలి.

Tags

Next Story