దిగుమతులు చేసుకోవడంలో తప్పులేదు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

దేశ వృద్ధిని పెంచుకునేందుకు దిగుమతులు చేసుకోవడంలో తప్పులేదన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే వినాయకుడి విగ్రహాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనదేశంలో దొరకటి, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకును బయటికి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో తప్పులేదన్నారు. ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ... విగ్రహాల దిగుమతులపై వ్యాఖ్యలు చేశారు.
ఉపాధి అవకాశాలు కల్పించలేని, స్వయం సమృద్ధి చేకూర్చని దిగుమతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఏవిధంగానూ సహాయపడవన్నారు నిర్మలా సీతారామన్. మట్టితో చేసిన విగ్రహాలను స్థానికంగా కొనుగోలుచేయాలన్నారు. కానీ వీటిని కూడా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని ప్రశ్నించారు. సబ్బు పెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజా సామాగ్రి వంటి రోజువారి గృహోపకరణాలు స్థానిక తయారీ దారుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.
మనం వస్తువుల్ని స్థానికంగా తయారు చేసుకుని కొనుగోలు చేస్తేనే.. ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచన వెనక ఉన్న అసలు లక్ష్యం నెరవేరుతుందన్నారు. స్వయం సమృద్ధి అనేది ఎంతోకాలంగా భారత్ అవలంభిస్తోందని, కాలానుగుణంగా అది అంతరించిపోయిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో అది మళ్లీ సాధ్యమవుతుందని నిర్మాలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com