భారత అంతరిక్ష రంగంలో మరో కొత్త అధ్యాయం

భారత అంతరిక్ష రంగంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రభుత్వ అనుమతి లభించింది. ఇకపై రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, వాటి ప్రయోగం, గ్రహాంతర యాత్రలతో సహా అన్ని రకాల అంతరిక్ష కార్యక్రమాల్లోనూ... ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. దేశంలో ప్రైవేటు అంతరిక్ష వ్యవహారాల పర్యవేక్షణకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ - IN SPACE అనే నూతన సంస్థ ఏర్పాటు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ సంస్థ ఇస్రోకు- ప్రైవేటు అంతరిక్ష కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలనుకునే వ్యక్తులు, సంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తుందని కె.శివన్ అన్నారు. మన అంతరిక్ష రంగం త్వరితగతిన అభివృద్ధి చెందటమే కాకుండా... అంతరిక్ష ఆర్థిక వ్యవహారాల్లో భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com