ఢిల్లీ చేరుకున్న ఎంపీ రఘురామ కృష్ణమరాజు

ఢిల్లీ చేరుకున్న ఎంపీ రఘురామ కృష్ణమరాజు
X

వైసీపీలో అగ్గిరాజేసిన ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు.. ఢిల్లీ చేరుకున్నారు. తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి హోదాతో పాటు వైసీపీ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తూ ఇటీవలే లేఖ రాశారాయన. తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనే పార్టీ వేరే వాళ్లదని, వైఎస్‌ఆర్‌ అనే పేరు ఉపయోగించవద్దని గతంలోనే ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు. అసలు పార్టీలో ఈసీ నిబంధనల ప్రకారం... క్రమశిక్షణా కమిటీనే లేదన్నారాయన. అలాంటిది విజయసాయిరెడ్డి తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ..... ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటిని వివరించేందుకు... ఈసీని కలవనున్నారు రఘురామకృష్ణమరాజు. అలాగే బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను కూడా కలసి రాష్ట్రంలో జరుగుతున్న పాలన, అరాచకాలను వివరించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story