అచ్చెన్నాయుడుని 3 గంటలపాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు

ESI కేసులో అచ్చెన్నాయుడుని తొలిరోజు 3 గంటలపాటు ప్రశ్నించారు ACB అధికారులు. GGHలోనే కస్టడీకి తీసుకుని వైద్యుల పర్యవేక్షణలోనే పలు అంశాలపై వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. DSPలు ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ ఈ ఎంక్వైరీ కొనసాగించింది. ఇవాళ, రేపు కూడా మందుల కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోసం ప్రశ్నల పరంపర కొనగనుంది. విచారణ ఉదయాన్నే మొదలవుతుందని అంతా భావించినా సాయంత్రం నాలుగున్నర గంటల సమయలో ACB టీమ్ ఆస్పత్రికి చేరుకుంది. సూపరింటెండెంట్‌తో సమావేశం తర్వాత 5 గంటలకు అచ్చెన్నను కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అచ్చెన్న ఆరోగ్యంగానే ఉన్నారని విచారణకు సహకరించారని అధికారులు చెప్పారు.
ముఖ్యంగా టెలీహెల్త్ సర్వీసెస్‌కు సిఫారసు విషయంలో ACB ఆయన్ను ప్రశ్నించింది. మంత్రిగా ఓ కంపెనీకి సిఫార్సు చేస్తూ సంకతం చేసిన నేపథ్యంలో దానిపై వివరణ కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఈ సర్వీసుల అమలుపై అధ్యయనం చేయాలని తాను సూచించానని, మినిట్స్‌పై మాత్రమే సంతకం చేశానని అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోళ్ల సమయానికి ఆయన మంత్రిగా లేకపోయినా అందుకు సిఫార్సు చేసినందుకు ఆయనకు లబ్ది చేకూరి ఉండొచ్చన్న కోణంలో ACB ప్రశ్నలు సాగాయి. అలాగే.. అచ్చెన్నయుడికి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలపై కూడా దర్యాప్తు బృందం ఆరా తీసినట్టు అచ్చెన్న తరపు అడ్వొకేట్ చెప్పారు.
ఐతే.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు విచారణ ముగియాల్సి ఉన్నా.. రాత్రి వరకూ విచారణ సాగడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆరోగ్యం బాగోలేకపోయినా అచ్చెన్నాయుడిని రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టి విచారించారని ఆయన తరపు న్యాయవాది హరిబాబు అన్నారు. హెల్త్ కండీషన్ బాగోలేకపోయినా డిశ్చార్జ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు. టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి ప్రశ్నలు అడిగారని, కేవలం ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొనుగోళ్లను పరిశీలించమనే అచ్చెన్న లెటర్ ఇచ్చారని అడ్వొకేట్ చెప్పారు. ఇవాళ, రేపు విచారణ ఉదయం 10 నుంచి 5 గంటల మధ్యే ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
అటు, ఇదే కేసులో మరో నలుగురుని కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వారిని రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించినట్టు తెలుస్తోంది. అటు, అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. అర్థరాత్రి కుట్రలేంటని నిలదీశారు. ప్రాణాలతో చెలగాటం ఆడడం మంచిది కాదని హితవు పలికారు. మొన్న అర్థరాత్రి హడావుడిగా డిశ్చార్జ్ చేసేందుకు ప్రయత్నించడం కూడా కుట్రేనన్నారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ.. YCP నేతల ఒత్తిళ్ల మేరకు పనిచేయడం సరికాదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com