మీకు తెలియకుండా మీ డేటా మొత్తం టిక్ టాక్ ద్వారా..!!

మీకు తెలియకుండా మీ డేటా మొత్తం టిక్ టాక్ ద్వారా..!!

చైనా ఫోన్లు.. చైనా రూపొందించిన టిక్ టాక్. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది భారతీయులు టిక్ టాక్ లోనే గడిపేస్తున్నారనేది వాస్తవం. ఈ టిక్ టాక్ అప్లికేషన్ భారీ మొత్తంలో వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని చైనాకు చేరవేస్తోందనే పలుమార్లు చర్చకు వచ్చినా అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ విషయం ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. వినియోగదారుల కీలకమైన డేటాను తస్కరిస్తున్నట్లు సమాచారం. వినియోగదారుడు

ఆపిల్ ios ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iphone వాడుతున్నట్లైతే ఈ ప్రమాదం మరింత పొంచి ఉన్నట్లు వెల్లడైంది. ఒక వినియోగదారుడు Apple ios 14 preview ని ఇన్ స్టాల్ చేసిన వెంటనే ఈ విషయం బయటపడింది. వినియోగదారుడు తన ఫోన్లో క్లిప్ బోర్డ్ లోకి కాపీ చేసే సమాచారాన్ని అతనికి ఏ మాత్రం తెలియకుండా టిక్ టాక్ దొంగిలిస్తున్నట్లు తెలిసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగి ఉండదని గ్యారంటీ లేదు.

Tags

Read MoreRead Less
Next Story